ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయనకి కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 6 వరకు ప్రజాపాలన కొనసాగుతుందని, ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు అమలు చేసేందుకు పూనుకున్నామని, 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, ఇప్పటికే 2 హామీలు ప్రజలలోకి తీసుకొచ్చామని అన్నారు. ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకూడదని గ్రామాలలోకి ప్రజాపాలనను తెచ్చామని, గత పదేళ్లుగా స్వరాష్ట్రంలో ప్రజల కలలు కలలైనాయని, చిత్తశుద్ధితో పనిచేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులం కృషి చేస్తున్నామని, కిందిస్థాయి ఉన్నటువంటి బీదాసాదలకు ప్రభుత్వ పథకాలు అందాలనే మా తాపత్రయం అని అన్నారు. మేడిగడ్డను మేము కూడా సందర్షించామని, 6 లక్షల 71 కోట్లు రూపాయల అప్పును తెలంగాణ నెత్తిన పెట్టారని, అప్పులు తప్పు కాక పోయినా, సరైన రీతిలో ఆ నదులను సద్వినియోగం చేయలేదని,కేవలం రాచ ఠీవి అనుభవించేందుకు తెలంగాణను వాడుకున్నారని, విలాసాలు, భోగాలు అనుభవించి ప్రజల సమస్యలను పక్కన పెట్టా రని అన్నారు. ప్రజల కష్ట, సుఖాలలో పాలుపంచుకుంటామని, గత ప్రభుత్వం తెలంగాణకు సమకూర్చిన ఆస్తులతో కొత్త సెక్రటేరియట్ కట్టారని, పేదోళ్ల కష్టాలు తీర్చకుండా, వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. మీరిచ్చే ప్రతి అప్లికేషన్ కూడా కంప్యూటరైజ్ చేస్తామని, నిండుకుండ లాంటి రాష్ట్రాన్ని, వట్టి కుండ చేశారని, తెలంగాణ ప్రజలు కోరిన కోర్కెలన్నింటినీ పూర్తి చేస్తామని, ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండానే ప్రజాపాలన కార్యక్రమం పూర్తి చేస్తున్నామని, ప్రజల గుమ్మం ముందుకే పధకాలు వస్తాయని, పేదోళ్లకే ప్రాధాన్యత ముందుగా ఉంటుందని అన్నారు.
74
previous post