81
అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మదనపల్లిలో మంగళవారం జరిగింది. ఒకటవ పట్టణ పోలీసుల కథనం మేరకు స్థానిక కమ్మ వీధికి చెందిన దావూద్(38) పట్టణంలో చిరు వ్యాపారాలు చేస్తాడు. ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు వడ్డీ వ్యాపారుల చెంత కొంత అప్పులు చేసి వాటిని తీర్చలేక పోయాడు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడితో తీవ్ర మనస్తాపం చెందిన బాధితుడు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి బాధితున్ని జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.