టికెట్ల కేటాయింపులో అధిష్టానం నిర్ణయం మేరకూ అందరూ కలిసి పని చేస్తామని, ఎవరికి అసంతృప్తి లేదని ఏపీ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మెరుగు నాగార్జున స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల దృష్ట్యా టికెట్లు కేటాయింపులో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అయితే అధిష్టానం నిర్ణయం మేరకూ అందరు కలిసి పని చేస్తామని, రాబోయే ఎన్నికల్లో తానూ పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చంద్రబాబు, అతని టీం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదని, మాతో చంద్రబాబుకు ఏం పనో అర్ధం కావడం లేదని, చంద్రబాబు తన పార్టీ వ్యవహారాలు చూసుకుంటే మంచిదన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కాకుండా కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నావో, లోకేష్ ఎందుకు మంగళగిరిలో పోటీ చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, చంద్రబాబు హామీ ఇచ్చిన నెరవేర్చక పోవడం వల్లే ప్రజల్లోకి వెళ్ళలేక పోతున్నారని, పవన్ ను మళ్ళీ కలిసి చంద్రబాబు ఎన్నికల్లోకి వెళ్తున్నారే గానీ మాకు ఏ పార్టీతో పని లేదని, మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వేరే చోట పని చేయబోతున్నారే గానీ, మా పార్టీలో అమర్‌నాథ్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అని ఏపి మంత్రి మెరుగు నాగార్జున తెలియజేశారు.
మాతో నీకేం పని బాబు…
78
previous post