సదాశివపేట మండల మరియు పట్టణ ప్రజలకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ప్రోటోకాల్ పేరుతో రెండు వర్గాల నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. నువ్వా నేనా అంటూ గొడవ కు దిగిన ఇరు వర్గాల నాయకులు కార్యకర్తలు. ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న గాని పాటించని ప్రోటోకాల్ ఈరోజు గుర్తుకొస్తుందా అంటూ మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. నువ్వా నేనా అంటూ పోటీపడడంతో టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన లబ్ధిదారులు. అధికారుల సమన్వయం లోపంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఇంత జరిగిన ఒక పోలీస్ కూడా ఇక్కడ లేకపోవడం వలన అధికారులలో సమన్వయ లోపం బట్టబయలైంది.
Read Also..