105
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వైభవోపేతంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరభద్ర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ వారి వారి రంగాలలో అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.