జాతీయ రహదారి భద్రతా మాసం 2024 లో భాగంగా నార్త్ జోన్ తిరుమల గిరి ఆర్.టి.ఎ కార్యాలయం వద్ద మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్లు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ ధైవఘ్న శర్మ పాల్గొని పలు సూచనలు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, హెల్మెట్‌లు ధరించాలని, మోటార్ కార్లు, ట్యాక్సీ డ్రైవర్లు సీటు బెల్టులు ధరించాలని వాహనదారులకు సలహాలు ఇచ్చారు. ప్రయాణికుల ను ఓవర్ లోడ్ చేయకుండా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రమాదాలకు కారణమయ్యే ట్రిపుల్ రైడింగ్‌పై రహదారి వినియోగదారులకు అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలను వాహనాలు నడపడానికి అనుమతించవద్దని సూచించారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ నడపడం, వాటి ప్రభావం మానవ జీవితంపై పడుతుందని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనాలు నడుపుతూ హెల్మెట్ ధరించి వెళ్లే వాహనదారులకు, కార్లలో సీటు బెల్టులు ధరించి వెళ్లే వారికి, పరిమితి లోపలే ప్రయాణికులను ఎక్కించే ఆటోరిక్షా డ్రైవర్లకు పూలమాలలు వేసి సత్కరించారు.
Read Also..