70
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ, తేదీన అమల్లోకి రావడంతో ఇక అప్పటి నుంచి ఏటా గణతంత్ర దినోత్సవంను జరుపుకుంటున్నామని అన్నారు. చేవెళ్ల ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.