కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం మొగమూరు వాగును ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పరీశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారని, డబ్బులు మంజూరు చేసిన వ్యక్తి ఆ వర్కులు ఏ ప్రోగ్రెస్ లో ఉన్నాయో చూడటం లేదన్నారు. విడుదల చేసిన నిధులు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా పర్యవేక్షించాల్సిన వ్యక్తి ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదని ఆయన ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ వస్తానే పునాది రాళ్లు వేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ఫౌండేషన్ లెవెల్ కూడా దాటలేని స్థితిలో కాంట్రాక్టర్లు ఉన్నారని ఆయన విమర్శించారు. మొగమూరు వాగు హిమకుంట్ల నుంచి పాలగిరి వరకు రెండు పక్కల రాళ్లతో రక్షణ గోడ కట్టాల్సి ఉందని, రాతి కట్టడం అక్కడక్కడ కట్టి పూర్తిగా వదిలేశారని ఆయన తెలిపారు. వర్షాలు అధికంగా వస్తే ఆ కట్టలు తెగి వర్షపు నీరు పొలాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గంలో 214 కిలోమీటర్ల రోడ్లు వేయాలని నిధులు మంజూరు చేస్తే.. ఆ పథకం కింద రెండు కిలోమీటర్ల రోడ్లు కూడా వేయలేని పరిస్థితి ఉందని అన్నారు. దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్న రోడ్లు వేయలేదని అసంపూర్తిగా పనులు చేసి విడిచి పెట్టారని ఎమ్మెల్సీ విమర్శించారు. గతంలో నీరు చెట్టు కింద చేసిన పనులకు రైతులు పొలాలకు మట్టితోలుకునే వాటికి టెండర్లు పిలిచి నిలిపివేశారని అన్నారు. ముఖ్యమంత్రి పులివెందులకు కేటాయించిన నిధుల గురించి ప్రతి నెల ముఖ్యమంత్రి ఎంపీ జిల్లా కలెక్టర్, అధికారులు సమీక్ష సమావేశం చేస్తున్నారని, ఎందుకు ఈ మెగమూరు వాగు, రోడ్లు ఎందుకు పూర్తి కాలేదని, ఎందుకు సమీక్షలు చేయలేకపోతున్నారని ఆయన అన్నారు. పులివెందులను అబివృద్ధి చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడని ఎమ్మెల్సీ ప్రశ్నించారు.
పులివెందులను అబివృద్ధి చేయలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడు..
62
previous post