ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటితో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీలు వీడ్కోలు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల్ నుస్తులాపూర్ గ్రామానికి సర్పంచ్ రావుల రమేష్ కృషితో ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పాలకవర్గం, ప్రజల సహకారంతో రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు. జిల్లాలో ప్రథమ స్థానం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడంతో నుస్తులాపూర్ గ్రామం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఆడపిల్ల పుడితే 5116 రావుల రమేష్ సర్పంచ్ తన సొంత డబ్బులతో ఫిక్స్ డిపాజిట్ బాండ్లు మహాలక్ష్మి అనే ఫథకం పేరుతో ప్రతి కుటుంబానికి ఇస్తూ రాష్ట్రంలోనే కాకుండా… దేశంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అదేవిధంగా దహన సంస్కరనాల విషయంలో తన సొంత ఖర్చులతో చనిపోయిన కుటుంబానికి పెద్దమనిషి లా తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సహకారంతో నుస్తులాపూర్ గ్రామాన్ని మోడల్ గ్రామ పంచాయతీ గా రూపుదిద్దరూ… దీంతో రాష్ట్ర వ్యాప్తంగా… జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు నుస్తులాపూర్ గ్రామాన్ని అబ్బురపరిచే విధంగా సర్పంచ్ రావుల రమేష్ చేయడంతో పలువురు మాజీ మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, వినోద్ కుమార్, గంగుల కమలాకర్ ప్రశంసించారు.
అంబరానంటిన గ్రామ పంచాయతీ వీడ్కోలు సంబరాలు…
46
previous post