కపలనత్తం గ్రామంలో రెండు రోజులైనా పెన్షన్ ఇవ్వని వాలంటీర్ హరీష్.. మీడియాకు సమాచారం తెలిసిందని, తెలుసుకున్న అధికారులు పెన్షన్ ను యధావిధిగా అందజేశారు. వాలంటీర్ హరీష్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా శెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్ప మీడియాతో మాట్లాడారు, కపలనత్తం గ్రామంలో వాలంటీర్ హరీష్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత రెండు రోజులు అయినా హరీష్ పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వలేదన్నారు. గత రెండు రోజులుగా హరీష్ కు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నారు. ఈ విషయంపై నిన్న ఎంపీడీవోకు ఫిర్యాదు చేశామన్నారు. ఎంపీడీవో ఈ విషయంపై వాలంటీర్ హరీష్ కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. వాలంటీర్ హరీష్ విధులను సక్రమంగా నిర్వహించడం లేదని ఆయన అన్నారు. వాలంటీర్ హరీష్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రెండు రోజులైనా పెన్షన్ ఇవ్వని వాలంటీర్..
68
previous post