67
రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టుపెట్టిందని జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం జూరాల ప్రాజెక్ట్ పై ఎమ్మెల్యే ఈ సందర్భంగా ధర్నాకు దిగారు.తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిందని ఇందుకు నిదర్శనమే KRMB ను కేంద్రానికి అప్పచెప్పడమే అన్నారు. దీనిని నిరసిస్తూ జూరాల డ్యాం పై ధర్నాకు కూర్చున్నట్టు, ప్రభుత్వం చేపట్టిన దుశ్చర్యలను పునరాలోచించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.