56
హైదరాబాద్‌లో క్రమంగా పెరుగుతున్న ఎండలు.. కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయిదు రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది. హైదరాబాద్‌లోనూ 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్, మెదక్, భద్రాచలం, హనుమకొండ ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత కనిపిస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్, రామగుండంలలో సాధారణంగా14 డిగ్రీలు కన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. Read Also..