ఏపీలో ప్రకృతి వ్యవసాయ ఆవిష్కరణలు పట్ల అంతర్జాతీయ ప్రతినిధి బృందం ప్రశంసలు కురిపించింది. మరీ ముఖ్యంగా వర్షపాతం తక్కువగా ఉండే అనంతపురంలాంటి జిల్లాల రైతులకు ఎంతో మేలు జరుగుతోందని పేర్కొంది. వర్షాధార పంటలపై ఆధారపడ్డ నేలలకు ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు ఆవిష్కరించిన విత్తన గుళికల ప్రక్రియ పట్ల విదేశీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏపీలో ఒకే క్షేత్రంలో 25 రకాల మొక్కలను పెంచుతూ జీవ వైవిధ్యతను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. షార్జా రాజ కుటుంబానికి చెందిన షేక్ మజీద్, ఇటలీకి చెందిన ఫ్యూచర్ ఎకానమీ ఫోరం వ్యవస్థాపక అద్యక్షుడు వాల్టర్ లింక్, అమెరికాకు చెందిన ప్రపంచ బ్యాంక్ సీనియర్ సలహాదారులు నలిన్ కిశోర్, అశోక్ వైష్, దేశ్ దీప్ సహదేవ్ అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని మరూరు గ్రామంలో పర్యటించారు. బాలముద్దన్న వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించారు. జీవ ఎరువుల తయారీని చూశారు. అక్కడ చేసే అంశాలను రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ తెలిపారు. అతి తక్కువ నీటితో ఒకటింపావు ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల మొక్కలను ఎలా పెంచుతున్నారో వివరించారు. Read Also..
ప్రకృతి వ్యవసాయ ఆవిష్కరణలు పట్ల అంతర్జాతీయ ప్రతినిధి బృందం ప్రశంసలు
87
previous post