ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే.. తనది అర్జునుడి పాత్ర అని ముఖ్యమంత్రి దెందులూరు సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే.. ఆ ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనం అని పేర్కొన్నారాయన. ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా?. ఇంటింటి చరితను.. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా? అని సీఎం జగన్ కేడర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే యెల్లో వైరస్ మీద.. కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయంపై సంగ్రామానికి ప్రతీ ఒక్కరూ సిద్ధమేనా? అని సీఎం జగన్ ప్రసంగించారు. Read Also..
ఎన్నికల రణక్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే.. తనది అర్జునుడి పాత్ర..
70