హైదరాబాద్ పంజాగుట్ట సిఐ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజాభవన్ వద్ద బారికేడ్ కొట్టిన కేసులో బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ తప్పించుకున్న కేసులో సిఐ దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. ఇటీవల పంజాగుట్టలో పనిచేస్తున్న పోలీసు సిబ్బంది అంతా సిపికి బదిలీ అయ్యారు. అయితే సస్పెన్షన్ తర్వాత సిఐ దుర్గారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది లీకేజీలతో తప్పించుకుంటున్న దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సిఐ దుర్గారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఏపిలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో సిఐ దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు.
బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద షకీల్ కుమారుడు సాహిల్ కారును అతివేగంగా నడుపుతూ బారికేడ్లను ఢికొట్టాడు. పంజాగుట్ట సిఐ.. సాహిల్‌కు బదులుగా మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. దీంతో స్పందించిన పోలీసు అధికారులు సిఐని సస్పెండ్ చేశారు. సెక్షన్ 17 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అప్పట్లో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి కూడా సాహిల్ కారణమని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు షకీల్ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండడంతో సాహిల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. Read Also..
పంజాగుట్ట సిఐ దుర్గారావు అరెస్ట్
75
previous post