ఏపీ(Andhra Pradesh) రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. వైసీపీని ఓడించి అధికారాన్ని చేపట్టాలని టీడీపీ – జనసేన కూటమి వ్యూహాలను రచిస్తోంది. రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తన వంతు కృషి చేస్తోంది. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ పెద్దలతో ఆయన భేటీ అవుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు చర్చల కోసమే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందిస్తూ పొత్తులపై తమ హైకమాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ సూచించినట్టు ఎంపీ స్థానాలను గెలుస్తామని చెప్పారు. తాము ఏం చేయాలనే విషయంలో తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అన్నారు. Read Also..
Andhra Pradesh: రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న ఏపీ రాజకీయాలు
87
previous post