ఏజెన్సీ ముఖద్వారం అయినా గోకవరంలో అరణ్యాల్లో ఉండాల్సిన వానరాలు (Monkeys) గ్రామాల్లో స్వైర విహారం గోకవరం మండలంలో రోజురోజుకి పెరుగుతున్న కోతుల బెడద కనీసం నివారణ చర్యలు చేపట్టని అధికారులు ప్రజాప్రతినిధులు.
కేరాఫ్ అడ్రస్ గా మారిన గోకవరం..
గోకవరం మండలం కోతులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. జిల్లాలోని అన్ని మండలాల కంటే ఇక్కడే ఎక్కువ మొత్తంలో అడవులు విస్తరించి ఉన్నాయి. మొదట్లో వానరాలు వందల సంఖ్యలో ఉండగా ప్రస్తుతం వేల సంఖ్యలో విస్తరించాయి. అడవుల్లో వాటికి భుజించడానికి ఏం దొరక్కపోవడంతో గ్రామాల్లో పంట పొలాలకు, చివరకు ఇళ్లపైకి వస్తున్నాయి. పొలాల్లో పంటలున్న సమయంలో అక్కడే తిష్టవేసి పంటలను నాశనం చేస్తున్నాయి. రైతులపై దాడిచేసి గాయపరుస్తున్న సంఘటనలు లేకపోలేదు. పొలంలో ఏ పంట వేసిన పీకేయడం, తినడం సర్వసాధారణమైంది. వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామాల్లోకి వచ్చే సమయంలో రోడ్లకు అడ్డంగా పరుగుతీస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. తరచూ ద్విచక్ర వాహనదారులు రోడ్లపై కోతుల సంచారంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. కోతుల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
వానరాలు (Monkeys):
గోకవరం మండలంలోని దాదాపు అన్ని గ్రామాలలో కోతుల (Monkeys) బెడద ఉంది. సాగుచేసిన పంటల్ని నాశనం చేయడంతో పాటు సమీప గ్రామాల ఇళ్లపైకి ఎక్కి నానా హంగమా చేస్తున్నాయి. మగవారు ఇళ్లలో లేని సమయాల్లో వానరాలు ఇళ్లలోకి దూరుతున్నాయని, ఇంట్లో ఉన్నా వారిని భయపెట్టి అందిన ఆహారాన్ని ఎత్తుకెళుతున్నాయి. వాటిని పారద్రోలే ప్రయత్నం చేస్తే కోతులు దాడులు చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఒక్కోసారి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల టిఫిన్ బాక్సులు కన్పిస్తే చాలు లాక్కుని ఎత్తుకెళుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. కూరగాయల సంతలో, ఇళ్లపైన నిత్యం సంచరిస్తూ వీలైనప్పుడల్లా ఎత్తుకెళుతున్నాయి.
ఇళ్లలోకి దూరుతున్నాయని, వాటిని ఎదురించే ప్రయత్నం చేస్తే దాడులకు పాల్పడుతున్నాయని మహిళలు వాపోయారు. ఎక్కువగా మహిళలు, చిన్నారులు, వృద్ధులను భయపెడుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారు. మగవాళ్లున్న సమయాల్లో ఇళ్ల ముందున్న చెట్లపై సంచరిస్తున్నాయని, వెళ్లగొట్టే ప్రయత్నం చేసిన ఇలా వెళ్లి అలా తిరిగి వస్తున్నాయని వారు వాపోయారు. కుక్కలకు, కూడా కోతులు భయపడటం లేదని, వాటిపైకి ఎదురుదాడికి దిగుతున్నాయని చెప్పారు.
గోకవరం నుండి మొదలుకొని రాజానగరం, కోరుకొండ, సీతానగరం వరకు రోడ్డుపైన సంచరిస్తూ వాహనదారులను ఇబ్బందులతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు చొరవ తీసుకుని కోతులను అడవులకు వెళ్లేలా చేస్తే ప్రశాంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Read Also..
మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..