Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh పవన్ భీమవరం పర్యటన వాయిదా..!

పవన్ భీమవరం పర్యటన వాయిదా..!

by Satya
Pawan Kalyn.jpg

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫిబ్రవరి 14నుంచి 17వరకు జరగాల్సిన పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయ్యింది. R&B అధికారులు హెలిప్యాడ్ కు అనుమతులు నిరాకరించడంతో జనసేనాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో జనసేన నేతలు వైసీపీ పార్టీపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఓటమి భయంతోనే అనుమతి ఇవ్వలేదంటూ పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఆరోపించారు. జనసేనను ఎదుర్కోలేక వైసీపీ కుట్ర పన్నిందన్నారు. అధికారపార్టీకి అడ్డురాని నిబంధనలు ఇప్పుడు చెబుతున్నారన్నారు. పవన్ త్వరలోనే తేదీ ప్రకటించి భీమవరం వస్తారన్నారు. వైసీపీ నియంతృత్వ పోకడలకు భీమవరం నుంచే పతనం ప్రారంభం అవబోతుందన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

020238
Total views : 92563

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.