ఏపీ రాజకీయాలు (AP politics):
ఏపీ రాజకీయాల (AP politics) లో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ సమయం దగ్గర పడుతుంది. ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే ఏడు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించారు. కానీ టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల ఖరారు ఇంకా పూర్తి కాలేదు. తుది జాబితా విడుదల కాలేదు. ఇప్పుడు కొత్తగా వైసీపీ పార్టీ నుంచి టీడీపీ, జనసేన లోకి వలసలు పెరుగుతున్నాయి. చిత్తూరులో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆశావాహుల సంఖ్య అరడజనకు పైగా పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే టీడీపీకి అనుకూల పవనాలు వీస్తుండడంతో ఆశావాహుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది.
చిత్తూరు నియోజకవర్గం:
సీకే బాబు: చిత్తూరు నియోజకవర్గ సీటు జనరల్ కు కేటాయించడంతో కమ్మ, బలిజ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి అభ్యర్థులు తమకు సీటు దక్కించు కోవడంలో తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీకే బాబు చిత్తూరులో తన హవా మరోమారు నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీకే బాబు చిత్తూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆయన చిత్తూరులో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ తరపున యాక్టివ్ రోల్ కూడా పోషించడం లేదు. అయిన తన అభిమానులు సీకే బాబుని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు.
గురుజాల జగన్మోహన్ నాయుడు: మరో వ్యక్తి జీ.జే.ఎమ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, చైర్మన్ కమ్మ సామాజిక వర్గం కి చెందిన గురుజాల జగన్మోహన్ నాయుడు. ఈయన చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు బాగా పరిచయమున్న వ్యక్తి, కష్టమంటూ వచ్చింది అంటే చాలు ఆయన ట్రస్ట్ వైపు చూస్తుంటారట నియోజకవర్గంలోని పేద బడుగు, బలహీన వర్గాల ప్రజలు, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలను చేస్తున్న గురజాల జగన్మోహన్ నాయుడు.. అటు తెలుగుదేశం పార్టీలోని క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమం ఏదైనా.. అధినేత పిలుపు అందిందంటే చాలు.. తన శక్తి సామర్థ్యాల మేరకు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఆయన ఆధ్వర్యంలో చిత్తూరు నియోజవర్గంలో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని నియోజకవర్గ ప్రజల మాట. కొంత కాలంగా జీ.జే.ఎమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న గురజాల జగన్మోహన్ నాయుడు..
చిత్తూరులో ఆర్యవైశ్య సంఘం పిలుపు మేరకు చిత్తూరు స్మశాన వాటికలో 45 లక్షలతో ఎలక్ట్రిక్ బర్నింగ్ మిషిన్ డొనేట్ చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు పండుగ రోజుల్లో చిరు సాయంగా ప్రభుత్వం తరఫున అందజేసే ఈ సంక్రాంతి కానుక వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండీ అర్థాంతరంగా ఆగిపోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఇప్పుడు చిత్తూరు నియోజకవర్గంలో తన సొంత నిధులతో గురజాల జగన్మోహన్ నాయుడు అమలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ నాడు నియోజకవర్గంలోని 42 వేల కుటుంబాలకు సంక్రాంతి కానుకను అందజేసి నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలను అందుకున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వీరాభిమాని అయిన గురజాల జగన్మోహన్ నాయుడు… 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా అధినేత చంద్రబాబు అవకాశం కల్పిస్తే పసుపు జెండా ఎగరేసి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నారట. తన ట్రస్ట్ ద్వారా చేయగలుగుతున్న సేవా కార్యక్రమాలకు తోడు, ఎమ్మెల్యేగా అధికారం ఇస్తే చిత్తూరుని అభివృద్ధి పథంలో నడిపిస్తారని గురజాల జగన్ మోహన్ నాయుడు అభిమానులు, సన్నిహితులు భావిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
తేజేశ్వరి: ఏపీ రాజకీయాల (AP politics) లో దివంగత DK ఆదికేశవులు, DK సత్య ప్రభల కుమార్తె తేజేశ్వరి కూడా ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ద్వారా రాజకీయ అరం గేట్రం చేయాలని భావిస్తున్నారు. తండ్రి డీకే ఆదికేశవులు, తల్లి డీకే సత్యప్రభ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారు. బెంగళూరులో పారిశ్రామికవేత్తగా ఉన్న తేజేశ్వరి తల్లి సత్య ప్రభ, తండ్రి డికే ఆదికేశవులు ఎన్నికల్లో పోటి చేసినపుడు పార్టీ తరఫున ప్రచారం చేశారు. అంతే కాకుండా గుడిపాల మండల ఇన్చార్జిగా ప్రచార బాధ్యతలను నిర్వహించారు. బలిజ సామాజిక వర్గం ద్వార తేజేశ్వరి టిక్కెట్ ను ఆశిస్తున్నారు. ఈమెకు టికెట్ ఇస్తే అటు ఆర్థికంగాను, ఇటు గతంలో ఎన్నికల ప్రచారం చేసిన అనుభవంతో కచ్చితంగా గెలుస్తుందని జిల్లాలోని పెద్దలు భావిస్తున్నారు.
కటారి హేమలత: అలాగే చిత్తూరు కార్పొరేషన్ మేయర్ గా చేసిన కటారి హేమలత కూడా చిత్తూరు టికెట్ రేసులో ఉన్నారు. ఈమే తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. అత్త, మామలు కటారి మోహన్, కటారి అనురాధ రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న నేతలు. కటారి హేమలత చిత్తూరు మేయర్ గా, మామ జిల్లా ఉపాధ్యక్షుడిగా చేశారు. వారి వారసత్వంలో హేమలత నగర పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ, సమస్యల పైన పోరాడుతూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మరొకరు కాజూరు బాలాజీ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గా కొనసాగుతున్నారు. ఈయన తెలుగుదేశం పార్టీ టికెట్లను ఆశిస్తున్నారు. కాజూరు బాలాజీ చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. కరోనా సమయము నుంచి నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు. నియోజకవర్గం మొత్తం కరోనా సమయంలో తనవంతు సహాయం చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు పర్యటనలో కాజూరు బాలాజీ క్రియాశీలకంగా వ్యవహరించారు.
యన్ పి యస్ జయప్రకాష్: ఏపీ రాజకీయాల (AP politics) లో బంగారుపాల్యం మండలానికి చెందిన యన్ పి యస్ జయప్రకాష్ కూడా చిత్తూరు అసెంబ్లీ టికెట్ రేసులో ఉన్నారు. ఆయన తండ్రి NP భాస్కర్ నాయుడు దశాబ్ద కాలం పాటు CDCMS చైర్మన్ గా పనిచేశారు. జయప్రకాష్ బంగారు పాల్యం మండల పరిషత్ అధ్యక్షుడిగా, మండల పార్టీ అధ్యక్షుడుగా, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. జయప్రకాశ్ సతీమణి కూడా బంగారుపాలెం మండల పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న తనకు టికెట్ కేటాయించాల్సిందిగా జయప్రకాశ్ అధిష్టానంను కోరినట్లు సమాచారం.
ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి గురజాల జగన్ మోహన్ నాయుడు, యన్. పి. యస్. జయప్రకాష్, చిత్తూరుకు చెందిన మాజీ కార్పొరేటర్ వసంత్ కుమార్ కూడా టిక్కెట్లు ఆశిస్తున్నారు. మెత్తం మీద చిత్తూరు అసెంబ్లీ స్థానానికి రెడ్డి సామాజిక వర్గం నుంచి సీకే బాబు, బలిజ సామాజిక వర్గం నుంచి డీకే తేజేశ్వరి, కాజూరు బాలాజీ, కటారి హేమలత, టికెట్ రేసులో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. కానీ జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఎవరికి టికెట్ ఇస్తారని చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే చిత్తూరు అసెంబ్లీ టికెట్ వీరిలో ఎవరి తలుపు తడుతుందో వేచి చూడాల్సిందే. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.