అంబేడ్కర్ విదేశీ విద్య’ పేరును ముఖ్యమంత్రి జగన్ మార్చడాన్ని ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ సమర్థించారు. శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘అంబేడ్కర్ పేరును తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నా మాకు ఆనందమే. టీడీపీ హయాంలో అంబేడ్కర్ పేరుతో విదేశీ విద్యకు ఒక్కో విద్యార్థికి రూ.15 లక్షలు ఇచ్చేవారు. జగన్ ప్రభుత్వం రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఇస్తోంది. గతంలో కంటే డబ్బులు పెంచినందున అంబేడ్కర్ పేరును తీసేసినా తప్పుకాదు. జగన్ పేరు పెట్టుకున్నా, తన తండ్రి వైఎస్సార్ పేరు పెట్టుకున్నా తప్పు కాదు. తమకు డబ్బులే ముఖ్యం. అంబేడ్కర్ పేరు కాదు అని వ్యాఖ్యానించారు.
అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…