వంగలపూడి గ్రామం (Wangalapudi village):
సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో తిగిరిపల్లి మార్తమ్మ అను మహిళ భర్త గత ఏడాది అనారోగ్యం కారణంగా మరణించడంతో ప్రభుత్వం నుండి వచ్చిన 1,08075 రూపాయలు మరియు మట్టి ఖర్చు నిమిత్తం ప్రభుత్వం నుండి వచ్చిన 10వేల రూపాయలను వంగలపూడి గ్రామ సచివాలయం వాలంటీర్ గా పనిచేస్తున్న కోడెల్లి చిన్న రాము అనే యువకుడు ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం ద్వారా వంగలపూడి ఇండియన్ బ్యాంకు ఖాతా నుండి డబ్బులు కాజేసాడని తిగిరిపల్లి మార్తమ్మ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. బాధిత మహిళ తిగిరిపల్లి మార్తమ్మ డబ్బులు కాజేయడంలో వంగలపూడి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ చింతా శివ ప్రసాద్ పూర్తి సహకారం ఉన్నట్లుగా గ్రామ పెద్దలు, గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఇలాంటి సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
వంగలపూడి గ్రామం (Wangalapudi village) లో గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న ఈ యువకుడికి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం వంటి ఉపాధిని ఏరకంగా ఇస్తారని గ్రామ పెద్దలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లపై మండల అధికారి ఎంపీడీవో చర్యలు తీసుకోవలసి ఉన్నా గానీ పట్టించుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రజాసంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం నుండి నా భర్తకు రావలసిన డబ్బులు పడ్డాయా లేదా అని అడిగినప్పుడల్లా బ్యాంకు ఖాతా నుండి డబ్బులు వాలంటీర్ కాజేసినట్లుగా బ్యాంకు అధికారులు తెలియజేశారని బాధిత మహిళ విలేకరులకు తెలిపారు. ఇదిలా ఉండగా సీతానగరం పోలీస్ స్టేషన్ నందు భాదిత మహిళ అందజేసిన ఫిర్యాదు పై ఎస్సై టి రామకృష్ణ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటివి మరలా మరలా పునారావృతం కాకుండా అమాయకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టే వారిపై మండల, జిల్లా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని భాదిత మహిళ కుటుంభీకులు కోరుకుంటున్నారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.