Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh బ‌ర్డ్ ఫ్లూతో మూత‌బ‌డ్డ చికెన్ దుకాణాలు

బ‌ర్డ్ ఫ్లూతో మూత‌బ‌డ్డ చికెన్ దుకాణాలు

by Satya
Chicken shops closed due to bird flu

నెల్లూరు జిల్లాలో బ‌ర్డ్ ఫ్లూతో చికెన్ దుకాణాలు మూత‌బ‌డ్డాయి. దీంతో పేద మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు చికెన్ ముక్క అంద‌ని ద్రాక్షలా మారింది. ఇక వీరంతా బంగాళ‌దుంప‌ల‌నే చికెన్‌లాగా భావించి, లాగించేయాల్సిన ప‌రిస్థితి. ఇక ఉన్న మ‌హారాజులు మాత్రం ఆదివారం ముక్క లేనిదే ముద్ద‌దిగ‌ని వారు, మ‌ట‌న్‌, చేప‌ల‌పై ప‌డ్డారు. చికెన్ దుకాణాలు మూత‌బ‌డ‌టంతో, మ‌ట‌న్‌, చేప‌లు, రొయ్య‌ల‌కు గిరాకీ బాగా పెరిగింది. ఇదే అదునుగా వ్యాపారులు కూడా వాటి రేట్ల‌ను పెంచేశారు. దీంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ దుకాణాలు వెల‌వెల‌బోతుంటే, మ‌ట‌న్‌, చేప‌ల మార్కెట్‌లు జ‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. మ‌ట‌న్ కేజీ వెయ్యి రూపాయ‌ల‌కు పైగా ధ‌ర ప‌లుకుతుండ‌గా, చేప‌లు కిలో 250 రూపాయ‌ల వ‌ర‌కు ధ‌ర ప‌లుకుతుండ‌టం గ‌మ‌నార్హం. మొత్తం మీద బ‌ర్డ్ ఫ్లూ దెబ్బ చికెన్ ల‌భించ‌ని ప‌రిస్థితితో ప్ర‌త్యామ్నాయంగా ఉండే మ‌ట‌న్ చేప‌లు రొయ్య‌లు నెల్లూరు జిల్లాలో కొండెక్కి కూర్చున్నాయి. చికెన్ దుకాణాల్లో మాత్రం కొనుగోలుదారులు లేక వెలవెలబోతుండడంతో వ్యాపారులు మాత్రం ఒక్క రోజులోనే 50 వేల రూపాయలు నష్టపోయామని వాపోతున్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

  • మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
    ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
  • కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
    డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్లుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అరవై గ్రామాలకు ఆరోగ్యదాయనిగా ఉన్న రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

014526
Total views : 80424

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.