గోదావరిఖని (Godavarikhani):
పెద్దపల్లి జిల్లా గోదావరిఖ (Godavarikhani)ని చెందిన గాదే. సమ్మయ్య సింగరేణి ఉద్యోగి వారి కుమారుడు గాదే సాయి లెనిన్ ఓకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యొగాలు సాదించి రికార్డ్ సృష్టించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన నాలుగు పోటీ పరీక్షలలో ఉద్యోగం సాధించిడంతో పాటు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన సమ్మయ్య సింగరేణి ఓపెన్ కాస్ట్ 1 లో ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని కుమారుడు సాయి లెనిన్ గోదావరిఖనిలో పదో తరగతి వరకు విద్యను అభ్యసించాడు. ఇంటర్ హైదరాబాదులో, బీటెక్ వరంగల్ లో పూర్తి చేసిన లెనిన్ గేట్ ద్వారా హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసాడు.
Follow us on :Facebook, Instagram& YouTube.
ఈ క్రమంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన గోదావరిఖని ఎక్సైజ్ సిఐ స్ఫూర్తితో పోటి పరీక్షలకు సిద్ధమయ్యాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్ 4 పరీక్షలకు ప్రిపేర్ అయి హాజరయ్యారు. దీంతోపాటు సింగరేణి సంస్థ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సైతం విజయం సాధించి ప్రస్తుతం కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేస్తున్నారు. ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిన సాయి లెనిన్ ను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. తన విజయానికి తల్లిదండ్రులతో పాటు, ఎక్సైజ్ సిఐ రమేష్ ప్రోత్సాహం మరువలేనిదని లెనిన్ తెలిపారు. తన కుమారుని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు అందరూ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని లెనిన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు.. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.