ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ – ఐఐఎం విశాఖపట్నం శాశ్వత క్యాంపస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం–విశాఖ కార్యకలాపాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 242 ఎకరాల్ని ఉచితంగా కేటాయించింది. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. అటు.. తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – ఐఐటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ -ఐఐఎస్‌ఈఆర్ శాశ్వత క్యాంపస్‌లను కూడా ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. జాతికి అంకితం చేసే కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ, ఐఐఎస్‌ఈఆర్ డైరెక్టర్ శంతాను భట్టాచార్య పాల్గొంటారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.