మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునే ముందు భక్తులు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. గట్టమ్మ తల్లికి తోలిపూజల తర్వాతే, వనదేవతల దివ్య సన్నిధికి వెళ్తారు. మేడారం వెళ్లే వివిధ మార్గాల్లో గట్టమ్మ తల్లికి గుడులు ఉన్నప్పటికీ, ములుగు గట్టమ్మ తల్లికి మాత్రం సమ్మక్క సారలమ్మ తల్లులంత వైభవం ఉంటుంది. మేడారం గిరిజన రాజ్య స్వాతంత్య్రం, సాధికారత కోసం సాగించిన యుద్ధంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా ఉండేది.
Follow us on : Facebook, Instagram & YouTube.
అసమాన ధైర్యశౌర్య పరాక్రమాలతో, శత్రువులతో రణం చేసి గొప్ప యుద్ద వీరవనితగా పేరు తెచ్చుకొని చరిత్ర కెక్కింది గట్టమ్మ తల్లి. గట్టమ్మ తల్లితోపాటు అంగరక్షకురాలిగా సమ్మక్క సారలక్కలకు… సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క సమ్మక్క తల్లిని యుద్ధంలో శత్రువుల ఆయుధాలు దాడి నుంచి కాపాడుతూ యుద్ధరంగంలోనే అమరులయ్యారు. అందుకే ఈ అమరవీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకుని, గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళులర్పిస్తూ పూజలు చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.