దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెనెజ్మెంచ్ కాలేజ్ లో నేషనల్ లెవల్ టెక్ ఫెస్ట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రీగడీర్ గణేశం(ఇన్స్పెక్టర్ జనరల్ సర్వీస్ మినస్ట్రీస్ ఆపే డిఫెన్స్) శాంత తౌటమ్(అసిస్టెంట్ ప్రో..సోషలాలజి డైరెక్టర్) తో పాటు కళాశాల డైరెక్టర్ డా..కేవిరెడ్డి, ప్రిన్సిపాల్ మురళీ ప్రసాద్ లు పాల్గోని జ్యోతి ప్రజ్వాళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాలోరస్-24, ఈ సమ్మీట్’24 పేరిట ఫార్మసీ, ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన అన్యూవల్ రోబోఫెస్ట్, పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజంటేషన్, వర్క్ షాప్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ పై కాంపీటేటివ్స్ నిర్వహించడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ డా కె వి రెడ్డి అన్నారు. ఈ నెషనల్ ఫెస్ట్ ని ప్రతియేట తమ కళాశాలలో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సాప్ట్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ ను పెంపొందించవచ్చని దీని ద్వారా పిల్లల్లో టెక్నికల్ స్కిల్స్ పెరిగి ప్లేస్మెంట్స్ లో మంచి నైపుణ్యం పెరుగుతుందన్నారు. తద్వారా తమ జీవితాల్లో లీడర్ షిప్ క్వాలీటిస్ పెరిగి వారి బంగారు భవిష్యత్ కి బాటలు పడేవిధంగా ఉపయోగపడుతుందన్నారు.
నేషనల్ లెవల్ టెక్ ఫెస్ట్…
110
previous post