బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంద బలంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడడానికి వచ్చి జరిగిన తప్పు ఒప్పుకోవాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. మంథని పట్టణంలోని రెండు ఇళ్లలో విద్యుత్ మీటర్ రీడింగ్ చూసి జనరేట్ చేసిన జీరో బిల్ ను లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్ బాబు అందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు పేద ప్రజలకు అమలు చేసి తీరతామన్నారు. తన తండ్రి శ్రీ పాదరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నాణ్యత లేకుండా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పెద్దపల్లి, భూపాల్ పల్లి జిల్లాల్లో ఒక్క ఎకరానికైనా సాగునీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు.
గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు…
99
previous post