పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ(NTPC)
ఎన్టీపీసీ పరిధిలోని తెలంగాణ ప్రాజెక్టు సంబంధించిన రెండవ దశ 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని దేశ ప్రధాని ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. కాగా ఇటీవలే ఈ యూనిట్ ను అధికారులు వాణిజ్యపరంగా ఉత్పత్తిలోకి తీసుకువచ్చారు. అనంతరం ఈరోజు ఆదిలాబాద్ లో పర్యటించనున్న ప్రధాని వర్చువల్ విధానం ద్వారా ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులు 2016 లో ప్రధాని మోదీ ప్రారంభించగా. మొదటి దశ 800 యూనిట్ ను 2023 అక్టోబర్ లో ప్రారంభించారు. అనంతరం తాజాగా రెండో యూనిట్ ప్రారంభించడానికి ఈరోజు ముహూర్తం ఖరారు. ఈ సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్ షిప్ లోని కాకతీయ ఫంక్షన్ హాల్ లో ప్రత్యేక స్క్రీన్ లను అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు 10:30 కు ప్రదాని మోదీ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీపీసీ సంస్థ 10,598 కోట్లతో తెలంగాణ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా 1600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ కేంద్రాలను నిర్మించారు. రెండో దశలో మరో 2,400 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి