సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని న్యూ బోయిగూడా కొల్ల కొమరయ్య కాలనీలో హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ హేమలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ మన బస్తీ – మన బడి కార్యక్రమం ద్వారా న్యూ బోడోలాండ్ గొల్ల కొమరయ్య కాలనీలో అంగన్వాడి ప్రీ ప్రైమరీ స్కూల్, స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి కార్యచరణతో ప్రభుత్వం మెరుగైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో పునాదిగా నిలుస్తున్నటువంటి అంగన్వాడి కేంద్రాలను కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా నగరంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కమిటీలను రద్దు చేస్తున్నామని ఆయన అన్నారు.
అంగన్వాడి కేంద్రం ప్రారంభించిన మంత్రి పొన్నం….
128
previous post