ఏడు రాష్ట్రాల్లో దాదాపు 17 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు..
దేశంలో పలుచోట్ల ఎన్ఐఏ(NIA) సోదాలు చేపట్టింది. ఏడు రాష్ట్రాల్లో దాదాపు 17 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. 2013లో బెంగళూరు(Bangalore) జైలు నుంచి ఖైదీల పరారీ కేసు, రామేశ్వరం కేఫ్(Rameswaram Cafe) ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జైలు నుంచి పారిపోయిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు విస్తృతంగా చేపట్టారు. బెంగళూరు(Bangalore)లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మం చేశారు. రామేశ్వర్ కేఫ్(Rameswaram Cafe) పేలుడులో ఉగ్రవాదులకు సంబంధం ఉందని ఎన్ఐఏ(NIA) అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. పలు కేసుల్లో నిందితులకు నిషేధిత సంస్థలతో ఉన్న లింకులపై ఎన్ఐఏ(NIA) అధికారులు ఆరా తీస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.