Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh వైసీపీ నేతల మధ్య విభేదాలు..!

వైసీపీ నేతల మధ్య విభేదాలు..!

by Satya
YCP


విశాఖ జిల్లా(Visakhapatnam):

విశాఖ జిల్లా(Visakhapatnam) గాజువాక(Gajuvaka) వైసీపీ(YCP) నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గ సమన్వయకర్తను మార్చినప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా వున్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు.

టికెట్‌పై ఎవరికి వారే ధీమా వ్యక్తం..

సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి(MLA Nagireddy), ప్రస్తుత ఇన్‌ఛార్జి ఉరికిటి చందు మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది. టికెట్‌పై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. గాజువాక సీటు తమ నాయకుడిదేనని నాగిరెడ్డి వర్గం వెల్లడించింది. అయితే గతంలోనే గాజువాక అభ్యర్థి చందు అంటూ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ఓ ప్రకటన చేశారు. దీంతో కార్పొరేటర్ల మద్దతుతో ఉరికిటి చందు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతుంటే నేతల మధ్య ఈ కుమ్ములాటలు ఏమిటంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: జనంలోకి జనసేన కార్యక్రమం..


విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

014094
Total views : 78961

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.