సీఎం జగన్ (CM Jagan) :
పేదల సొంతింటి కలను సీఎం జగన్ (CM Jagan) నెరవేర్చారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో జరిగిన నారాయణరెడ్డి గారి పల్లె జగనన్న కాలనీ ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, అన్నమయ్య జిల్లా వైసిపి విభాగం మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ లతో కలసి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో 25 వేల గృహాలున్నాయని, జగన్ ప్రభుత్వంలో పట్టణ పేదల కోసం నారాయణరెడ్డి గారి పల్లె జగనన్న కాలనీలో 6500 పక్కా గృహాలు మంజూరు కావడంతో ఇక్కడ మరో పట్టణము రూపుదిద్దుకుంటోందన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నారాయణరెడ్డి గారి పల్లె జగనన్న కాలనీ లో భూగర్భ డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్, రహదారుల నిర్మాణం తదితర మౌలిక వసతులను కల్పించి ఆదర్శ కాలనీ గా తీర్చిదిద్దుతామన్నారు. మహిళలను అన్ని రంగాలలో జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. అమ్మ ఒడి, డ్వాక్రా రుణాల మాపీ, చేదోడు, చేయూత తదితర ఎన్నో పథకాలను మహిళలకందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. కరోనా కష్ట కాలాలలో తాము ప్రజలకు తోడుగా నిలిచామన్నారు. కోవిడ్ ఆసుపత్రులలోకి వెళ్లి రోగులకు మనో ధైర్యాన్ని కల్పించామన్నారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కానీ, ఆక్సిజన్ సిలెండర్ల సరఫరా ను చేయించడం జరిగిందన్నారు. ఆనందయ్య మందును ఇంటింటా పంపిణీ చేయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడు కాదు ఎన్నికలు లేనప్పుడు కూడా తాము ప్రజల కష్ట సుఖాలలో తోడుగా నిలుస్తామన్నారు. ఇప్పుడు ఓట్లు అడిగే వాళ్ళు కరోనా సమయంలో ఎక్కడికి పోయారని ఆయన ప్రశ్నించారు. జగనన్న కాలనీలలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్దిదారులకు, ఆ స్థలాలుపై సర్వహక్కులను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. ఉచితంగా పంపిణీ చేసిన ఇంటి స్థలాలపై మహిళలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ కూడా చేసి హక్కు పత్రాలను అందించడం జరుగుతొందన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : గిరిజన రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయాలి – ఐలయ్య యాదవ్…
నారాయణరెడ్డి గారి పల్లె జగనన్న కాలనీలో 6050 రిజిస్ట్రేషన్లకు గాను నేటికి 5395 రిజిస్ట్రేషన్లు పూర్తి అయ్యాయని, ఇక 655 మాత్రమే రిజిస్ట్రేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని సూచించారు. ఒకప్పుడు రాయచోటి అంటే గలాటాలు, రౌడీయిజం, గూండాయిజం లు రాజ్యమేలాయని, ఆ పరిస్థితుల నుంచి ప్రశాంతంగా తీర్చిదిద్దామన్నారు. నియోజక వర్గాన్ని శాంతియుతంగా ఉంచడమే లక్ష్యమన్నారు. మంచి పనులతో, అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తానన్నారు. గొడవలు, అరాచకాలు జరగనివ్వనని మరోమారు శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, మదన పల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, బేపారి మహమ్మద్ ఖాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తబ్రేజ్ ఖాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రియాజుర్ రెహమాన్, కొలిమి చాన్ బాష, ఆసీఫ్ అలీ ఖాన్, షబ్బీర్, అల్తాఫ్, ఫయాజ్ అహమ్మద్, రియాజ్, రౌనక్, సుగవాసి ఈశ్వర ప్రసాద్, జానం రవీంద్ర యాదవ్, గౌస్ ఖాన్, అన్నా సలీం, బిసి సెల్ విజయ భాస్కర్, పల్లా రమేష్, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, కో ఆప్షన్ సభ్యులు అయ్య వారు రెడ్డి, హజరత్ ఖాదర్ వలీ, జి ఎం డి ఇర్షాద్, నేలపాటి వెంకటేష్, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లె ఇంతియాజ్, మూసా తదితరులు పాల్గొన్నారు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి