గూగుల్ ప్లే స్టోర్(Google Play Store)నుండి అనేక భారతీయ యాప్‌లను తొలగించడం ఇటీవల వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం పై భారతీయ డెవలపర్లు తీవ్ర ఆందోళన చెందారు. మరియు ఈ సంఘటన యాప్ పరిశ్రమ భవిష్యత్తు గురించి కూడా చాల ప్రశ్నలను లేవనెత్తింది.
గూగుల్ ప్లే స్టోర్(Google Play Store)నుండి యాప్‌లు తొలగింపులకు కారణాలు:
డేటా భద్రత మరియు గోప్యత సమస్యలు, గూగుల్ భారతీయ యాప్‌ల(Indian Apps)లో డేటా భద్రత మరియు సేఫ్టీ ప్రమాణాలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. డెవలపర్ పాలసీ ఉల్లంఘనలు, కొన్ని యాప్‌లు గూగుల్ ప్లే డెవలపర్ పాలసీలను ఉల్లంఘించినట్లు గుర్తించబడ్డాయి. చట్టపరమైన సమస్యలు కొన్ని యాప్‌లు భారత చట్టాలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించబడ్డాయి ఈ కారణాల చేత కొన్ని యాప్ లు ప్లే స్టోర్ నుంచి తొలగించబడ్డాయి.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
యాప్‌లను తొలగించడం వలన భారతీయ డెవలపర్లకు ఆదాయం నష్టం కలిగే అవకాశం ఉంది. మరియు వినియోగదారులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. యాప్‌లను తొలగించడం వలన భారతీయ యాప్ పరిశ్రమ అభివృద్ధి పతనమవుతుంది. దీని వల్ల భారతీయ వినియోగదారులు వారికి ఇష్టమైన యాప్‌లను ఉపయోగించలేకపోవచ్చు.
భారతీయ డెవలపర్లు డేటా భద్రత మరియు గోప్యత ప్రమాణాలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి. డెవలపర్లు గూగుల్ ప్లే డెవలపర్ పాలసీలను పాటించాలి.
భారతీయ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించడం ఒక పెద్ద సమస్యే కానీ. డెవలపర్లు, గూగుల్ మరియు భారత ప్రభుత్వం కలిసి పనిచేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి