వీరన్న స్వామి దేవాలయం (Veeranna Swamy Temple)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల పరిధిలో గల మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడ విరన్నను దర్శించుకోవాలి అంటే అడ్డుగా ఉన్న గోదావరి పడవ పై దాటాలి. మోతి గడ్డ వీరన్న (Moti Gadda Veeranna) దర్శనానికి ఆలయ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా ఇటు గోదావరి నుండి వచ్చే భక్తులు ఒక వంతు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిన చెన్నం పేట నుండి వచ్చే భక్తులు మరో వంతు… పెద్ద మొత్తంలో గిరిజన బిడ్డలు ఈ విరన్నను దర్శించుకుంటారు. ఇక్కడ శివరాత్రి రోజు జాగారం ఉండి నిద్ర చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయి అని ప్రజల నమ్మకం. అందుకే ఈ వీరభద్రుడు ప్రత్యేకం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: గర్భగుడిలో విశిష్టమైన సర్పం..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి