ప్రజాహిత యాత్ర (Prajahitha Yatra) :
రాష్ట్ర ప్రభుత్వం జీతాలివ్వడానికే పైసల్లేవని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఎట్లా అమలు చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎం పీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 గ్యారంటీలను అందరికీ అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ కొందరికే పరిమితం చేస్తోందని మండిపడ్డారు. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా రేషన్ కార్డు ప్రాతి పదికగా 6 గ్యారంటీలను అమలు చేయడం విడ్డూరమని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పలేని దుస్ధితి నెలకొందన్నారు. చొప్పదండి సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాగు నీటిని విడుదల చేయకపోవడంతో చాలా చరో్ల రైతులు పండించిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. తక్షణమే ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రజాహిత యాత్రలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండల కేంద్రంలో హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….
- రాముడి గుడి కడతారని ఎప్పుడైనా అనుకున్నారా?
- రాముడి గుడి గురించి మీ తరతరాలు చెప్పుకుంటారు.
- మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి గుడికి నా తరుపున 5 లక్షలు ఇస్తా
- అయోధ్యలో గుడి కట్టినం.. గంగాధర లా కూడా తప్పక కట్టిస్తా
- నరేంద్ర మోడీ 10 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు. గత పదేళ్ళలో కేసిఆర్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండా?
- మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడితే.. అర్థరాత్రి పోలీసులతో గోరగోర గుంజుక పోయిండు. మీ కోసం ఇంత కొట్లాడితే మీరు ఓటు తీసుకపోయి కాంగ్రెస్ కి వేస్తిరి.
- రేషన్, వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు అంటే మోదీ అంటారు? మీరు ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేశారు.
- చొప్పదండి ఉపాధి హామీ పనుల కోసం 167 కోట్ల 42 లక్షలు.. రోడ్ల మెటీరియల్ కోసం 72 కోట్ల 91 లక్షలు చెట్ల పెంపకం కోసం 88 కోట్ల 52 లక్షలు కేంద్రం నిధులు ఇచ్చింది.
- ఒక్క గంగాధర మండలంలో ఉపాధి హామీ పనుల కోసం 29 కోట్ల 87 లక్షలు… రోడ్ల మెటీరియల్ కోసం
11 కోట్ల 6 లక్షలు.. చెట్ల పెంపకం కోసం 19 కోట్ల 29 లక్షలు కేంద్రం ఇచ్చింది - మీరు ఎంపిగా గెలిపిస్తే 150 రోజుల పాటు 1600 కి.మి. పాదయాత్ర చేసి మీ కోసం కేసిఆర్ తో కొట్లాడా
- కేసిఆర్ పదేళ్ల లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు
- 6 గ్యారంటీ లు 100 రోజుల్లో అని కాంగ్రెస్ చెప్పే హామీలు అమలు చేయకపాయే. రేపో, ఎల్లుండో ఎన్నికల కోడ్ వస్తుంది.. అది బూచిగా చూపి మళ్ళీ ఎగొట్టే ప్రయత్నం చేస్తుంది.
- గ్యాస్ కనెక్షన్ మహిళల పేరు మీద ఉంటేనే హామీలు అమలు అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామా
- పార్లమెంట్ ఎన్నికల్లో గెలవకపోతే కేసిఆర్ కుటుంబం అమెరికా జంప్
- ఢిల్లీలో ఉన్న మోదీ ప్రభుత్వానికి ఓటేస్తేనే గ్రామాలకు నిధులు వస్తాయి.
*వచ్చేవి ఢిల్లీ ఎన్నికలు.. చాయ్ అమ్ముకునే వ్యక్తి మోదీ గారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. దయచేసి ఆలోచించి పువ్వు గుర్తుకి ఓటేయండి. - రైతులకు సబ్సిడీల ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎకరానికి 15 వేల వరకు సహాయం చేస్తుంది..
- మోదీకి ఓటేయకపోతే రైతులపై 15 వేల భారం పడుతుంది.
- కాంగ్రెస్ కి ఓటేస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి నిధులు తీసుకొస్తారా? కాంగ్రెస్ కి ప్రధాని అభ్యర్థి లేడు. ప్రధాని అభ్యర్థి లేని పార్టీకి ఓటు ఎందుకు వేయాలి?
- మహిళల దినోత్సవ సందర్భంగా మోదీ గ్యాస్ సిలిండర్ పై 500 రూపాయలు తగ్గించుడు.
- మీరు నాకు ఓటేస్తే నేను వెళ్లి మోదీకి ఓటేస్తా.
- దేశం కోసం ధర్మం కోసం.. పేదల కోసం పని చేసే వ్యక్తిని.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి : ఘనంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణం మహోత్సవం..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి