తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు. స్వంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3 వేల 500 ఇళ్లను మంజూరు చేయాలని సూచన ప్రాయంగా సర్కార్ నిర్ణయం తీసుకుంది. గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కలను దశలా వారీగా నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అర్హులైన వారికే లబ్ధి చేకూరుస్తామని తెలిపింది . లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు స్పష్టం చేసింది. సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను ప్రభుత్వం ఇప్పటికే తయారు చేయించింది. ఈ ఇళ్ల నిర్మాణాల్లో తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణాల నమూనాలు రిలీజ్ చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం…
152
previous post