పాకిస్థాన్‌లో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారని, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పెషావర్‌లోని నాసిర్‌బాగ్ రోడ్‌లోని బోర్డు బజార్‌లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో పార్క్ చేసినటువంటి మోటార్ సైకిల్‌లో పేలుడు పదార్థాలు అమర్చి ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పేలుడులో మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, గాయపడిన వారిని ఖైబర్ టీచింగ్ ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. ఇంతకుముందు ఫిబ్రవరిలో జరిగిన పేలుడులో ఐదుగురు పోలీసులు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. గత నెలలో, సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్తాన్‌లో వరుస బాంబు దాడులు జరిగాయి.
పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి…
110
previous post