తాజాగా ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఆర్టికల్స్ పేరుతో మరో కొత్త ఫీచర్…
తాజాగా ఎక్స్ ప్లాట్‌ఫామ్ ఆర్టికల్స్(Articles) పేరుతో మరో కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ స్పెసిఫికేషన్(specification)తో ఇప్పుడు ప్లాట్ఫామ్లో నేరుగా లాంగ్-ఫామ్ కంటెంట్‌ను పబ్లిష్ చేసుకోవచ్చు. కొత్త స్పెసిఫికేషన్(specification)తో మరింత డీటైల్డ్ కంటెంట్‌ను షేర్ చేసుకోవచ్చు. యూజర్లు దీని కోసం చాలా కాలంగా అడుగుతుండగా ఎట్టకేలకు కంపెనీ ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఆర్టికల్స్(Articles) ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది, కానీ ఇది నిర్దిష్ట యూజర్ గ్రూప్స్‌కు మాత్రమే ప్రత్యేకం. అంటే ప్రీమియం+ సబ్స్క్రైబర్లు(Premium+ subscribers), వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్‌కు మాత్రమే ఆర్టికల్స్(Articles) ప్రచురించే ప్రత్యేక హక్కు ఉంటుంది. ఫ్రీ లేదా సాధారణ యూజర్లు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోలేరు. ఈ ప్రత్యేక సదుపాయం, కంటెంట్ విశ్వసనీయమైన, నమ్మదగిన మూలాల నుంచి మాత్రమే వచ్చిందని నిర్ధారిస్తుంది. ఆర్టికల్ ప్రారంభించడానికి యూజర్లు ప్లాట్‌ఫామ్ వెబ్సైట్ x.comలో సైడ్ మెనూలో ఉన్న ఆర్టికల్స్(Articles) ట్యాబ్‌కు వెళ్లాలి. అక్కడ రైట్ బటన్‌పై క్లిక్ చేసి ఆర్టికల్ కంపోజ్ చేయవచ్చు. తప్పులు సరి చూసుకున్నాక ఆర్టికల్ లైవ్ చేయడానికి పబ్లిష్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
పోస్ట్-పబ్లిషింగ్ ఆప్షన్స్…
ఆర్టికల్ ప్రచురించిన తర్వాత, అది ఆథర్ ప్రొఫైల్‌లో ‘ఆర్టికల్స్’ ట్యాబ్‌లో కనిపిస్తుంది. అందులోని ఆర్టికల్స్‌ను ఆథర్స్ ఎప్పుడైనా ఎడిట్ చేయవచ్చు లేదా రిమూవ్ చేయవచ్చు. అంటే వీరు పబ్లిషింగ్ తర్వాత కంటెంట్‌పై పూర్తి కంట్రోల్ కలిగి ఉంటారు.
కొత్త ఫార్మాటింగ్ టూల్స్…
- యూజర్లు వివిధ రకాల ఫార్మాటింగ్ టూల్స్‌ను ఉపయోగించి మంచి, ఆకర్షణీయమైన ఆర్టికల్స్ క్రియేట్ చేయవచ్చు. ఎక్స్ ప్లాట్‌ఫామ్ చాలా స్పెసిఫికేషన్లను సపోర్ట్ చేస్తుంది.
- బోల్డ్, ఇటాలిక్స్, స్ట్రైక్‌త్రూ సహా వివిధ టెక్స్ట్ స్టైల్స్‌తో యూజర్లు ఆర్టికల్స్‌ను సరికొత్తగా మార్చవచ్చు.
- రీడబిలిటీ కోసం ఆర్డర్ (నంబర్) లేదా క్రమం లేని (బుల్లెట్) లిస్ట్స్ క్రియేట్ చేయవచ్చు.
- స్పష్టమైన, సరైన హెడ్డింగ్స్‌తో కంటెంట్ అర్థమయ్యేలా రాయవచ్చు.
- ఎడిషనల్ కాంటెక్స్ట్ లేదా రిఫరెన్స్‌లను అందించడానికి ప్లాట్‌ఫామ్ లేదా ఎక్స్టర్నల్ లింక్‌ల నుంచి పోస్ట్‌లను చేర్చవచ్చు.
- టెక్స్ట్‌లో ఇమేజ్‌లు, వీడియోలు, GIFలను ఇన్సర్ట్ చేసి, ఆర్టికల్స్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎయిర్ హ్యూమిడిఫైయర్ ఉంటే ఏసీతో పని లేదు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి