మూడు నెలలుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో ఓ పవర్ లూమ్ కార్మికుడు (Power loom worker) ఉరివేసుకొని ఆత్మహత్య (suicide) చేసుకున్న సంఘటన సిరిసిల్లాలో చోటుచేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్ కు చెందిన తడక శ్రీనివాస్ (thadaka srinivas) అనే పవర్ లూమ్ కార్మికుడు రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేస్తున్నాడు. తడక శ్రీనివాస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చేసుకున్న పనితో మందులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు… ఇదే సమయంలో గత మూడు నెలలుగా సిరిసిల్ల పట్టణంలో పవర్లూమ్ పరిశ్రమలో పనులు లేక ఇబ్బందులకు గురై చివరికి మందులకు డబ్బులు లేని స్థితిలో మనస్థాపానికి గురైన శ్రీనివాస్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు కూతుళ్లు అనూష …అక్షయ ఉన్నారు. వీరి కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబీకులు… పవర్ లూమ్ కార్మికులు కోరుతున్నారు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి