కాకినాడ రూరల్ మండలం ఇంద్రపలెం గ్రామంలో పిల్లి అంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కళ్యాణమండపం లో టీడీపీ, జనసేన నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జనసేన ఉమ్మడి శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రూరల్ టిడిపి కో కోఆర్డినేటర్ కటకంసెట్టి వెంకట ప్రభాకర్(బాబీ) పాల్గొన్నారు. ముందుగా నాయకులు కార్యకర్తలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులను, పిల్లి సత్యనారాయణ మూర్తి పంతం నానాజీ లను గజ మాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీడీపీ జనసీన కలయిక వలన వైఎస్సార్సీపీ పార్టీ లో ఓటమి భయం మొదలు అయ్యిందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పంతం నానాజీ ను గెలుపెంచుకోవల్సిన బాధ్యత ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలపై ఉందన్నారు. పిల్లి సత్యనారాయణ మూర్తి, పంతం నానాజీ కలయిక రూరల్ నియోజకవర్గంలో ఒక సునామీ సృష్టిస్తుందన్నారు. 51 బూత్ లో టీడీపీ జనసేన కలిసిన వెనుకబడి ఉన్నామనీ,
జనసేనకులకు కొంచెం ట్రైనింగ్ అవసరమన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ కన్వినర్లు సమన్వయం తో పనిచేయాలి అనీ సూచించారు. పిల్లి సత్యనారాయణ మూర్తి సలహాలు లేకుండా నేను ముందుకు వెళ్ళాననీ పంతం నానాజీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ, జనసేన నాయకుల విస్తృత స్థాయి సమావేశం…
90
previous post