ఈసీకి నూతన ఎన్నికల కమిషనర్లను ఎంపిక..
ఇవాళో.. రేపో.. ఏ క్షణమైనా లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) షెడ్యూల్ విడుదల(Release schedule) చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈసీ(Election Commissioners)కి నిన్న నూతన ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వాళ్లు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ(Prime Minister Modi) నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీ నిన్న భేటీ అయ్యి.. ఆరుగురి పేర్ల పరిశీలన తదనంతరం చివరకు రిటైర్డ్ ఐఏఎస్‌లు జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధులను నూతన ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసింది. ఆ వెంటనే వీళ్లిద్దరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ఆమోద ముద్ర వేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్రాల వారీగా సమీక్షలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల(Lok Sabha Elections)కు సైతం షెడ్యూల్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: బీజేపీ రెండో జాబితా విడుదల..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి