కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (mudragada padmanabham) నేడు వైసీపీ (YCP)లో చేరనున్నారు. ముద్రగడ ఇప్పటికే కిర్లంపూడి నుండి విజయవాడకు చేరుకున్నారు. ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటి వరకూ ఆయన కాపు సామాజికవర్గం సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలకూ దూరంగా ఉన్నారు. అయితే ఈరోజు ముద్రగడ వైసీపీలో చేరుతుండటంతో సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లయింది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని కాపు సామాజికవర్గంలో ప్రభావం చూపే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా పార్టీలో చేరనున్నారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ముద్రగడ ఇప్పటికే ప్రకటించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి