సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal reddy) సోదరుడు గూడెం మధు సూదన్ రెడ్డి (Madhusudhan reddy) అక్రమ అరెస్ట్ (Illegal arrest) పై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎమ్మెల్యే లు మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, సునితా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలోనికి బీఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఒప్పుకోక పోతే కేసులు పెడుతున్నారన్నారు. ఎలాంటి నోటీసులు, ఎఫ్ ఐ ఆర్ ఇవ్వకుండా అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయటం అక్రమమని మండిపడ్డారు. అరెస్టు చేసేటపుడు ప్రొసిజర్ ఉంటుందని, ప్రజాస్వామ్య రహితంగా అరెస్టు చేయటం ఘోరమన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, పోలీసులు మితిమీరి ప్రవర్తించొద్దని సూచించారు. పదేళ్లలో ఎప్పుడూ బిఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. బెయిలబుల్ అఫెనెన్స్ ఉన్నా ఏదో విధంగా క్యారెక్టర్ డామేజ్ చేసి లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టార్గెట్ చేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే లను ఇబ్బందులు పెడుతున్నారని, జిల్లా మంత్రి రాజనర్సింహ ఆదేశాలతోనే అధికారులు ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు హరీష్ చెప్పారు. మూడునెలల కాల వ్యవధిలో గూడెం మధుపై మూడవ కేసు పెట్టారని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి.. ప్రతిపక్షాలపై గ్లొబెల్ ప్రచారం చేస్తూ.. బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. క్వారీకి అన్ని అనుమతులు ఉన్నా వేదించే కార్యక్రమం చేయటం తప్పు.. న్యాయస్థానానికి వెళతాం.. న్యాయపోరాటం చేస్తామని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్డారం క్వారీ అనుమతులు తీసుకున్నామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్వారీలపై చర్యలు తీసుకుంటూ అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు.
క్వారీని గతంలోనే లీజుకు ఇవ్వడం జరిగిందని, గత నాలుగేళ్లుగా తమ సోదరుడు మధుసూదన్ రెడ్డి చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇబ్బందులకు గురిచేయటం జరుగుతుందన్నారు. తాము తప్పు చేస్తే పెనాల్టీ వేయండి, నోటీసు ఇవ్వండని, అంతేకాని దొంగలు లెక్క తెల్లవారుజామున 3గంటలకు మధు సూదన్ రెడ్డిని అరెస్టు చేయటం చట్ట విరుద్ధమన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వేదింపులకు ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఇప్పుడు అక్రమమని అంటున్న అధికారులు అప్పుడేం చేశారని మండిపడ్డారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే గా మూడు సార్లు ప్రజా ఆశీస్సులతో గెలిచాను,నేను తప్పు చేస్తే ప్రజలు బండకేసి కొట్టేటోళ్లన్నారు. అన్ని పర్మిషన్లతో క్రషర్ నిర్వహిస్తున్నామని, గతంలో ప్రభుత్వం హయాంలో లేని సమస్య ఇపుడు ఎందుకు వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, తన సోదరుని అరెస్టుపై మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. అనంతరం గూడెం మధు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇది చదవండి: తిరుపతి టికెట్టు ఆరని శ్రీనివాస్ కే..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి