శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఏప్రిల్ 26 న వార్షిక కుంభోత్సవం దేవస్థానం నిర్వహించనుంది. ఈ నేపద్యంలో చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం గాని శుక్రవారం గాని ఏది ముందుగా వస్తే ఆరోజున కుంభోత్సవం నిర్వహించడం దేవస్థానం ఆనవాయితీ అలానే ఈ సంవత్సరం జరిగే కుంభోత్సవానికి సాత్విక బలిగా కుంభోత్సవానికి ఆరంభ ప్రతీకగా దేవస్థానం ఆధ్వర్యంలో కొబ్బరి, గుమ్మడి, నిమ్మకాయలు సమర్పించారు. దేవస్థానం ఆనవాయితీ ప్రకారం నేడు శుక్రవారం కావడంతో ఉదయం శ్రీ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహించే ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి ఇవ్వడం జరిగింది. అయితే మహా శివరాత్రి తర్వాత వచ్చే ప్రతి మంగళ, శుక్రవార రోజుల్లో కొబ్బరికాయలు రాశులుగా పోసి, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సింహ మండపం వద్ద సాత్విక బలి సమర్పించడంతో లోక కల్యాణం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. అలానే ఏప్రిల్ 26న అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహిస్తునట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం…
115
previous post