పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం టిడిపి నాయకులతో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సమావేశం ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికలలో తనకు టికెట్ కేటాయించకపోవడంపై అసంతృప్తి తో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. 26 జిల్లాలలో చేనేతకు సంబంధించిన కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్లో కనీసం మూడు నాలుగు చోట్ల అయినా కూడా చేనేతకు సంబంధించిన వారి టికెట్లు కేటాయించాలని కోరారు. తనకు పుట్టపర్తి నియోజకవర్గంలో టికెట్ కన్ఫామ్ చేస్తారని అనుకున్నాను కానీ ఎక్కడా ప్రకటించకపోవడంపై నిమ్మల కిష్టప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. అందువల్లనే కార్యకర్తలతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశానని తనకు టికెట్ కేటాయించకపోతే భవిష్యత్తు కార్యచరణ కార్యకర్తలతోనే నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతానని అన్నారు.
కనీసం హిందూపురం పార్లమెంట్ టికెట్ అయినా తనకు కేటాయించాలని లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని అన్నారు. అధిష్టానంతో మరొకసారి చర్చించి తాను నిర్ణయం తీసుకుంటానని, 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు నేను అవినీతికి పాల్పడలేదని, ఏ కార్యకర్తకైనా ఇబ్బంది కలిగితే తాను వెంట ఉండి వారి సమస్యను పరిష్కరించానని, ఇన్ని సంవత్సరాల చరిత్రలో మొదటిసారి తన కొట్టి టికెట్ కేటాయించకపోవడం చాలా బాధాకరంగా ఉందని వాపోయారు. కేవలం డబ్బు ఉన్న నాయకులకే టికెట్లు కేటాయించడం అన్యాయమని అన్నారు. కార్యకర్తలు ఆవేశ పడకుండా ఉండాలని అన్నారు. టిడిపి అధిష్టానం తనకు టికెట్ కేటాయించకపోతే కార్యకర్తలతో మమేకమై ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే దానికి సిద్ధమని హెచ్చరించారు.