బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్(BRS MLC Kavitha husband Anil), పీఆర్వో రాజేశ్(PRO Rajesh), మరో ముగ్గురు అసిస్టెంట్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు(Enforcement Directorate notices) ఇచ్చింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించింది. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టుకూ ఈడీ వెల్లడించింది. శుక్రవారం కవిత ఇంట్లో సోదాలు చేసిన సమయంలో కవిత ఫోన్‌లతో పాటు భర్త అనిల్ ఫోన్, పీఆర్వో రాజేశ్‌కు చెందిన రెండు ఫోన్లు, మరో ముగ్గురు అసిస్టెంట్లకు చెందిన ఫోన్లను ఈడీ సీజ్ చేసింది. మొత్తం పది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వీటిని తీసుకోవడానికి ఢిల్లీకి రావాలని వారికి తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసి… ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఆమెకు వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నారు. అంతలోనే ఇప్పుడు కవిత భర్తకు, మరో నలుగురికి ఈడీ నోటీసులు ఇవ్వడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి చర్యలకు సిద్ధం..
మరోవైపు తన కూతురు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. కవిత కోసం ఢిల్లీ అడ్వోకేట్ టీమ్‌ను కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. సోమా భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు ఢిల్లీలోని ప్రముఖ లాయర్లతోనూ మాట్లాడుతున్నారు. కవిత కేసు కొలిక్కి వచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
ఈడీ రేపటి నుంచి కవితను ఏడు రోజుల పాటు విచారణ..
ఈడీ రేపటి నుంచి కవిత (Kavitha)ను ఏడు రోజుల పాటు విచారించనుంది. ఈ నేపథ్యంలో సోమా భరత్ ఆధ్వర్యంలో అడ్వోకేట్ టీమ్ ఆమెకు అందుబాటులో ఉండనున్నారు. ఈడీ అధికారులు అడిగే ప్రశ్నలు… ఆమె చెప్పే సమాధానాలపై వారు సూచనలు ఇవ్వనున్నారు. కవిత కస్టడీలో ఉన్నప్పుడు రోజూ గంటసేపు ములాఖత్ ఉంటుంది. ఈ ములాఖత్ సమయంలో అడ్వోకేట్ టీమ్ అందుబాటులో ఉండి సూచనలు చేస్తుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు వారు అక్కడే ఆమెకు అందుబాటులో ఉంటారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: ప్రతిమ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో పోలీసులు తనిఖీలు..!
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి