కళ్యాణదుర్గం (Kalyanadurgam):
ఒకప్పుడు కళ్యాణదుర్గంలో టీడీపీని కనుసైగతో నడిపిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి. గత 2019లో ఎలక్షన్లో ఓడిపోయినప్పటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మరో వ్యక్తి నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన ఉమామహేశ్వర నాయుడు. ప్రస్తుతం వీరిద్దరూ పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తూ తమ సొంతపనులను చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. కనీసం మొన్న శంఖారావం కార్యక్రమం లో బాగంగా కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన నారా లోకేష్ సభ వైపు కుడా కన్నెత్తి చూడలేదు ఈ ఇద్దరు నాయకులు. అధినేత ఆదేశిస్తే నిప్పుల్లో సైతం దూకేందుకు సిద్ధపడే నాయకులు తీవ్ర నిర్వేదంతో పార్టీ కార్యకర్తలు గానీ పార్టీని గానీ పట్టించుకోకుండా నిస్తేజంగా ఉండిపోయారు. తమకు కాదని తమ నియోజకవర్గంలో ఓటు హక్కు కూడా లేని కాంట్రాక్టర్ సురేంద్రబాబుకు కళ్యాణ్ దుర్గం తెలుగుదేశం టికెట్ ఇవ్వడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
పార్టీకి, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని భరోసా ఇచ్చే తెలుగుదేశం నాయకులు కళ్యాణ్ దుర్గం లో కరువయ్యారు ఈ బాధ్యతలను గతంలో నిర్విఘ్నంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి ప్రస్తుత నియోజకవర్గం నాయుడులు పార్టీకి దూరంగా ఉంటున్నారు . పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో జరిగే ప్రతి శుభకార్యానికీ, చావుకీ వెళ్లి కార్యకర్తలకు వెన్ను తట్టి ధైర్యం నింపిన ఉన్నం అండ్ ఉమా నేడు పార్టీకి దూరమవ్వాల్సి వచ్చింది. అధినేత రమ్మని ఆహ్వానించినా వీరిద్దరూ ఆయనను కలవడానికి వెళ్లడం లేదు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఆస్తులు అమ్ముకున్నటువంటి ఇలాంటి నాయకులను అధిష్టానం చిన్న చూపు చూసిందిదన్న ఆవేదన వారి కార్యకర్తలలో కనిపిస్తోంది. ఎవరో ముక్కు మొహం తెలియని కాంట్రాక్టర్ ను కళ్యాణదుర్గానికి పంపించి ఇతనే మీ అభ్యర్థి.. ఇతన్ని గెలిపించండి అని పార్టీ ఆదేశిస్తే ఇన్ని రోజులు కష్టపడి మేము ఏం సాధించినట్లు అని లోన మదన పడుతున్నారట.
ప్రస్తుతం ఈ ఇద్దరి నాయకులు భవిష్యత్తు ఏమిటి.? పార్టీలో ఉంటారా..? లేదా పార్టీ మారతారా..? ఏమన్నా తెలియాలంటే కొంచెం కాలం ఆగాల్సిందే . అన్న క్యాంటీన్ ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో గత 700 రోజులుగా నడిపారు. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నా పార్టీ ఎందుకనో హనుమంతు రాయ చౌదరి మీద చిన్న చూపు చూసిందని ఆయన కార్యకర్తలు వాపోతున్నారు. అటు ఉమామహేశ్వర్ నాయుడు కూడా కార్యకర్తల కోసం తన ఆస్తులను కూడా అమ్ముకొని సేవ చేసినటువంటి నాయకునికి చివరికి అధిష్టానం మొండి చేయి చూపింది. కనీసం ఒక ఓటరుగా కూడా లేనటువంటి అమిలినేని సురేంద్రబాబును కళ్యాణ్ దుర్గం ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు మాటమాత్రమైన తమతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారంటూ ఉన్నం హనుమంతురాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడులు వాపోతున్నారు. ప్రస్తుతం పార్టీకి పార్టీ కార్యక్రమాలకు ఇద్దరు దూరంగా ఉన్నారు.
ఇది చదవండి: అంబరాన్నంటిన వైఎస్ఆర్ పార్టీ సంబరాలు
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి