రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని చెప్పారు. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీలు నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని ప్రశంసిస్తూ, ఆకాశానికి ఎత్తేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించారు. ప్రజలు ఇవ్వబోయే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని తెలిపారు. మీ జీవితాలను తీర్చి దిద్దే బాధ్యత మేము తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. మూడు పార్టీల జెండాలు వేరైనా… అజెండా ఒకటే. ప్రజా సంక్షేమం కోసం తపించే వ్యక్తి పవన్ కల్యాణ్. మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన గొప్ప నాయకుడు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మోదీ నిర్విరామంగా కృషి చేస్తున్నారని తెలిపారు. మోదీ నినాదం… సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్. మోదీ అంటే ఒక నమ్మకం. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్ ను 5వ స్థానానికి చేర్చిన నేత మోదీ అని చంద్రబాబు తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయే దే…
76
previous post