తెలంగాణకు కొత్త గవర్నర్‌గా సీ.పీ.రాధాకృష్ణన్ నియామకం..
తమిళిసై(Tamilisai) సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ఆమోదించారు. దీంతో తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరగాల్సి ఉంది. అయితే ఈలోపు జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan)కు తెలంగాణ(Telangana) బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. తెలంగాణ(Telangana)తో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనే బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము(Draupadi Murmu) ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ(Telangana)కు పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరిగేదాకా సీపీ రాధాకృష్ణన్(CP Radhakrishnan) గవర్నర్‌గా కొనసాగనున్నట్లు ఆ ఉత్తర్వుల సారాంశం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత..!