ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం డాక్టర్ నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ బూడిద కాలుష్యంపై పోరాట సమితివారు గత 40, 50 రోజులుగా చేస్తున్న పోరాటాల ఫలితంగా దిగివచ్చిన ఎన్టిటిపిఎస్ యాజమాన్యం. ఎన్టిటిపిఎస్ బూడిద అమ్మిన డబ్బులు ఏ అధికారి జేబులోకి వెళ్తున్నాయో యాజమాన్యం తెలియజేయాలని లేక ప్రభుత్వ అధికారులు చెప్పాలని ఎన్టిటిపిఎస్ బూడిద పోరాట సమితి అధ్యక్షులు చెరుకుమల్లి సురేష్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం ఉదయం పోరాట సమితి నాయకులు తమ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫండింగ్ సుమారు 30 కోట్ల రూపాయలు ఎప్పటికి ఇస్తారు దీని ద్వారా మా గ్రామాభివృద్ధికి తోడ్పడతాయి కానీ సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఇవ్వలేనివారు 30 కోట్ల పెండింగ్ బిల్లు ఎప్పటికి ఇస్తారు అంటూ ప్రశ్నించారు. 20 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందిస్తే కేవలం మూడు డిమాండ్లు మాత్రమే తీర్చగలమంటూ ఎన్టిటిపిఎస్ యాజమాన్యం వారు రాతపూర్వకంగా లేక విడుదల చేయడానికి స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ అధికారులు త్వరలోనే ఉన్నతాధికారుల సమక్షంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరారు.
3 కోట్లు ఇవ్వలేనివారు 30 కోట్లు ఇస్తారా ?
106
previous post